Tue Nov 05 2024 14:57:31 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుడు కె విశ్వనాథ్ ఇక లేరు
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మృతి చెందారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మృతి చెందారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెలుగు జాతికి అందించిన కె. విశ్వనాథ్ ఇక లేరు. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. కానీ వాటినేమీ పెద్దగా పట్టించుకోరు. ప్రేక్షకులను అలరింప చేయడమే లక్ష్యంగా ఆయన సినీ పరిశ్రమలో ముందుకు సాగారు.
శంకరాభరణం విడుదలయిన రోజే...
రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉనన్నారు. శంకరాభరణం విడుదలయిన ఫిబ్రవరి 2వ తేదీనే మరణించడం అది యాధృచ్ఛికమైనా ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన సినిమా విడుదల రోజే మరణించడం అందరినీ కలచి వేసింది.
51 సినిమాలకు...
1930 ఫిబ్రవరి 19న జన్మించిన కె విశ్వనాథ్ మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమా చేసేటప్పుడు ఆయన ఖాకీ డ్రస్సు వేసుకోవడం అలవాటు. అది చివరి వరకూ కంటిన్యూ చేశారు. ఆ1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించగా చివరిగా శుభప్రదం సినిమాకు డైరెక్షన్ చేశఆరు. 1992 ఆయనకు పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రమయింది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో విలక్షణమైన దర్శకుడిగా వెలుగొందారు.
Next Story