Mon Dec 23 2024 16:10:55 GMT+0000 (Coordinated Universal Time)
కొవాగ్జిన్ కు అరుదైన ఘనత.. యూనివర్సల్ వ్యాక్సిన్ గా గుర్తింపు
చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న ఈ టీకా.. యూనివర్సల్ వ్యాక్సిన్ గా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవిడ్ కు
ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ప్రస్తుతం ఇదొక్కటే దారి కనిపిస్తోంది. అందుకే.. భారత్ తో పాటు ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాకు చెక్ పెట్టగలిగే వ్యాక్సిన్లలో ఒకటి కొవాగ్జిన్. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ అరుదైన ఘనత సాధించింది.
చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న ఈ టీకా.. యూనివర్సల్ వ్యాక్సిన్ గా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవిడ్ కు గ్లోబల్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యం.. కోవాగ్జిన్ రూపంలో నెరవేరిందని ప్రకటించింది. వ్యాక్సిన్ అభివృద్ధి, లైసెన్సులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపింది. కాగా.. 2021 జనవరిలో భారత్ లో వ్యాక్సినేషన్ మొదలవ్వగా.. ఇప్పటి వరకూ 154 కోట్ల డోసులను పంపిణీ చేసింది కేంద్రం. వాటిలో 12 శాతం టీకాలు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ డోసులే ఉన్నాయి.
Next Story