రామారావు విత్ రామారావు..!
కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని చంద్రబాబు ఎన్నికల బరిలో నిలబెట్టినప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆమె వెనకాల నిలబడతారనుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు సుహాసిని కోసం ప్రచారం చేశారు. అయితే కూకట్ పల్లి బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని.. అందుకే సుహాసినిని నిలిబెట్టారు గనక అక్కడికి నువ్వు ప్రచారానికి వెళ్లొద్దని కేటీఆర్ స్నేహితుడు ఎన్టీఆర్ కి చెప్పాడని ప్రవచారం జరిగింది. ప్రచారానికి వెళితే ఇమేజ్ పోతుంది... అందుకే వెళ్లకుండా సైలెంట్ గా ఉండమనే సరికి ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, కేటీఆర్ లు ఫ్రెండ్స్ అనే ప్రూఫ్ ఒకటి బయటికొచ్చింది. కేటీఆర్, ఎన్టీఆర్ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి నిజంగానే కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ సుహాసి తరపున ప్రచారం చేయలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
చంద్రబాబు ట్రాప్ లో చిక్కకుండా...
అందుకే ఎన్టీఆర్... చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకోకుండా పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టాలనుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రచారానికి రానట్లేదు అంటూ సోషల్ మీడియాలో అప్పుడే ప్రచారం స్టార్ట్ ఆయ్యింది. మరి కేటీఆర్ చెప్పినందు వల్లే ఎన్టీఆర్... సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి డుమ్మా కొట్టాడో లేదో తెలియదు కానీ.. చంద్రబాబు వేసిన ప్లాన్ లో ఎన్టీఆర్ అయితే ఇరుక్కోలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ నటుడిగా అందరితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడనేది ఈ ఫోటో ద్వారా స్పష్టమవుతుంది. అయితే పైన కనబడుతున్న ఫోటో ఎన్టీఆర్, కేటీఆర్ లు కలిసి ఒక ప్రవేట్ పార్టీలో ఇటీవల పాల్గొన్న సందర్భంలో తీసిందని తెలుస్తోంది.