Thu Jan 16 2025 00:10:04 GMT+0000 (Coordinated Universal Time)
అక్క పోటీపై స్పందించిన తమ్ముళ్లు
కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీపై ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనదదని వారు పేర్కొన్నారు.
ట్వీట్ ద్వారా.....
తమ తండ్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ సేవలందించిన టీడీపీ తరపున ఇప్పుడు మా సోదరి సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం తమదని, ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న తమ సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు వారు ఉమ్మడిగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Next Story