Mon Dec 23 2024 13:07:03 GMT+0000 (Coordinated Universal Time)
పదవులు వేలంపై అధికారుల సీరియస్
పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల [more]
పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల [more]
పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి లేఖ రాశారు. వికారాబాద్ జిల్లా బోజ్యానాయక్ తండాలో వేలం ఉదంతాన్ని ప్రస్తావించిన ఆయన, ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. పదవులు వేలం వేసినా, అక్రమాలకు పాల్పడినా, ప్రభావితం చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం డీజీపీని కోరింది. అందుకు అనుగుణంగా పదవుల వేలంపై తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరారు.
Next Story