Sat Dec 21 2024 08:02:06 GMT+0000 (Coordinated Universal Time)
సోమిరెడ్డి గాలి తీశారే…!!
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన శాఖ అధికారులే షాకిచ్చారు. కరువు, అకాల వర్షాలపై ఇవాళ సమీక్ష జరపాలని సోమిరెడ్డి భావించారు. ఈ మేరకు ఈ నెల [more]
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన శాఖ అధికారులే షాకిచ్చారు. కరువు, అకాల వర్షాలపై ఇవాళ సమీక్ష జరపాలని సోమిరెడ్డి భావించారు. ఈ మేరకు ఈ నెల [more]
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన శాఖ అధికారులే షాకిచ్చారు. కరువు, అకాల వర్షాలపై ఇవాళ సమీక్ష జరపాలని సోమిరెడ్డి భావించారు. ఈ మేరకు ఈ నెల 24నే అధికారులకు సోమిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఇవాళ సమీక్ష జరపడానికి సచివాలయానికి వచ్చిన మంత్రి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురుచూశారు. అయితే, ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా సమీక్షకు అధికారులు హాజరుకాలేదు. సమీక్షలకు హాజరుకాకపోతే సుప్రీం కోర్టుకు వెళతానని ఇప్పటికే సోమిరెడ్డి గతంలో వ్యాఖ్యానించారు.
Next Story