Mon Dec 23 2024 16:04:19 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి గుంటూరులో లాక్ డౌన్ ను?
నేటి నుంచి గుంటూరులో పూర్తి లాక్ డౌన్ అమలు పర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
నేటి నుంచి గుంటూరులో పూర్తి లాక్ డౌన్ అమలు పర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
నేటి నుంచి గుంటూరులో పూర్తి లాక్ డౌన్ అమలు పర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క గుంటూరు నగరంలోనే వీటి సంఖ్య పదిహేను వరకూ ఉంది. దీంతో సోమవారం నుంచి గుంటూరులో సంపూర్ణ లాక్ డౌన్ ను పాటించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గుంటూరు పట్టణంలో ఆరు రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇక్కడ హైరిస్క్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా నేటి నుంచి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.
Next Story