Sat Dec 21 2024 16:36:56 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి... మృతుడు వరంగల్ వాసి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులపై పోలీసు కాల్పులలో ఒకరి మృతి చెందారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులపై పోలీసు కాల్పులలో ఒకరి మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వారిని దామోదర్ గా గుర్తించారు. దామోదర్ వరంగల్ కు చెందిన వారుగా చెబుతున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.
అప్రమత్తమయిన రైల్వేశాఖ....
సికింద్రాబాద్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. దాదాపు 71 రైళ్లను రద్దు చేసింది. అనేక రైళ్లను దారి మళ్లించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడుతు్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కూడా రైల్వేస్టేషన్ లలో పోలీసు భద్రతను పెంచారు. రైల్వే పోలీసులతో పాటు అదనపు బలగాలను రైల్వేస్టేషన్లలో మొహరించారు.
Next Story