ప్రభుత్వానికి చురకలంటించిన హైకోర్టు
రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని హై కోర్టు ప్రశ్శించింది. ఆర్టీసీ ఆస్తుల, అప్పుల పంపకాలు విషయం కేంద్రం [more]
రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని హై కోర్టు ప్రశ్శించింది. ఆర్టీసీ ఆస్తుల, అప్పుల పంపకాలు విషయం కేంద్రం [more]
రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని హై కోర్టు ప్రశ్శించింది. ఆర్టీసీ ఆస్తుల, అప్పుల పంపకాలు విషయం కేంద్రం పరిధిలో ఉందని ఏజీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వాటా రీ ఎంబర్స్మెంట్ రూ. 1,099 కోట్లు అని మీరే చెప్తున్నారుగా అని ప్రశ్నించింది హై కోర్టు. రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.1,099 కోట్లు ఉన్నాయని సర్కార్ తెలిపింది. బకాయిల్లో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని పేర్కొన్న ప్రభుత్వం బ్యూరోక్రాట్స్లు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, తెలివిగా మాట్లాడి నిజాలను దాచేస్తున్నారని హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్పష్టంగా చెప్పండి…..
ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా చెప్పాలంది హైకోర్టు. రూ. 4,253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని కోర్టు ప్రశ్నించింది. కోర్టుకు సమర్పించే నివేదికలో బ్యూరోక్రాట్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ముందు అధికారులు వాస్తవాలను నిజాయితీగా ఒప్పుకోవాలని హైకోర్టు పేర్కొంది. ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇచ్చారని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వలేదా అని మరోమారు ప్రశ్నించింది. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని చెప్పింది ప్రభుత్వం.
ప్రభుత్వం పై కోర్టు సెటైర్లు
ఉపఎన్నిక జరిగిన హుజూర్ నగర్ నియోజకవర్గంలో రూ. 100 కోట్ల వరాలు ప్రకటించడం పై హై కోర్టు సెటైర్లు వేసింది. ఒక్క నియోజకవర్గం ప్రజలు ప్రభుత్వానికి ముఖ్యమా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 100 కోట్ల రూపాయల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి , ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వలేరా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది హై కోర్టు