Mon Nov 25 2024 05:09:10 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ స్పీచ్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం..?
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని పదే పదే విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని పదే పదే విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోక్ సభలోనూ, నేడు రాజ్యసభలోనూ అంతే. మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు చెప్పే తీర్మానంపై ప్రసంగించడం ప్రారంభించిన తర్వాత అదానీ.. అదానీ అంటూ విపక్ష సభ్యులు హోరెత్తించారు. మోదీ మాత్రం తన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, నిర్ణయాలు వంటివి మాత్రం తనదైన శైలిలో చెప్పుకుంటూ పోతున్నారు. కాని వెనక నుంచి మాత్రం షేమ్.. షేమ్.. అని, అదానీ ... అదానీ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా వినిపించడం ఉభయ సభల్లోనూ కనిపించింది. వినిపించింది.
జేపీసీకి డిమాండ్...
అదానీ వ్యవహారపై విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ను కాంగ్రెస్ పార్టీయే నాశనం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలని విపక్షాలకు లేదని అన్నారు. విపక్షాల తీరు చూస్తుంటే బాధే స్తుందన్నారు. ముఖ్యమైన సభలో ఇలాంటి నినాదాలు ఏంటని మోదీ ప్రశ్నించారు. విపక్షాల నిరసనల మధ్యనే మోదీ ప్రసంగం కొనసాగించారు. గత తొమ్మిదేళ్ల నుంచి దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు తాము పరిష్కారం చూపుతున్నామన్నారు.
కాంగ్రెస్ పై పూత పూస్తే...
కాంగ్రెస్ పార్టీ సమస్యలకు పై పూత పూసిందని, తాము మాత్రం శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని మోదీ అన్నారు. ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ మాత్రం తన పాలనలో దేశాన్ని నాశనం చేసిందన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నిరాకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. విపక్షాల నినాదాల మధ్యనే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అదానీ వ్యవహారం పై మాట్లాడాలంటూ విపక్షాలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. యూపీఏ పనితీరును తాను నిశితంగా గమనించానని, అభివృద్ధి లేని పాలన అంటూ మోదీ ఫైర్ అయ్యారు.
Next Story