ఒక దేశం- ఒకే ఎన్నికలు పై మండిపడుతున్న ప్రతిపక్షాలు
పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ప్రారంభిస్తామని ప్రకటించిన రెండో రోజు (సెప్టెంబర్ 1న) ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనపై కేంద్రం ఒక కమిటీని రూపొందించింది. ఈ ప్యానల్ కు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ నాయకత్వం వహించి, రిపోర్టును సమర్పిస్తారు. సభ్యులుగా మాజీ న్యాయమూర్తులు ఉంటారు.
ఒక దేశం- ఒకే ఎన్నికలు పై
మండిపడుతున్న ప్రతిపక్షాలు
పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ప్రారంభిస్తామని ప్రకటించిన రెండో రోజు (సెప్టెంబర్ 1న) ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనపై కేంద్రం ఒక కమిటీని రూపొందించింది. ఈ ప్యానల్ కు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ నాయకత్వం వహించి, రిపోర్టును సమర్పిస్తారు. సభ్యులుగా మాజీ న్యాయమూర్తులు ఉంటారు.
ఒకదేశం- ఒకే ఎన్నిక లక్ష్యం లోక్ సభ, (దిగువసభ) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే సారి నిర్వహించడం. ప్రధాని మోడీ, ఆయన పార్టీ నాయకులు దీనిని పదే..పదే ప్రస్తావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే ఖర్చుల భారం తగ్గుతుందని, ప్రజానాయకులు ప్రజాసంక్షేమ విధులపై పూర్తి సమయం కేటాయించవచ్చని చెబుతున్నారు. బీజేపీ ఎన్నికల సంస్కరణలు తేవాలని, అందులో భాగంగా నేరస్తులను రాజకీయాలలో లేకుండా చేయాలన్నది తమ లక్ష్యంగా చెబుతోంది. దీనికోసం ప్రతిపక్షాలతో చర్చిస్తామని, దీనిలో భాగంగానే ఒకే దేశం- ఒకే ఎన్నికలను ముందుకు తెచ్చినట్లు చెబుతోంది . దీనివల్ల ఎన్నికల ఖర్చులు తగ్గడమే కాకుండా.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిలకడగా పనిచేస్తాయని, ఎన్నికల ఖర్చుల పరిమితులపై సమీక్షించే అవకాశం ఉంటుందన్నది బీజేపీ వాదం.
మండిపడుతున్న ప్రతిపక్షాలు
ఈ ప్రతిపాదనపై దేశంలోని ప్రతిపక్షాలు తక్షణమే స్పందించి మండిపడుతున్నాయి. బీజేపీ ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లడం కోసం ఈ ప్రతిపానను తెచ్చాయని మహారాష్ట్ర శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వెలిబుచ్చారు. భారతదేశం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది.. దానిపై ఎవరికీ బేధాభిప్రాయం లేదు.. అక్రమాలు జరగకుండా ఎన్నికలు జరపడం కేంద్రం విధి.. దాని నుంచి పార్టీలు, ప్రజల ఆలోచనను మళ్లించడానికే ఈ డిమాండును తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ‘సమావేశాలు ప్రారంభం కానీయండి ప్రతిపక్షాల పోరాటం కొనసాగుతుంది’ అని అన్నారు.
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (ఉభయ సభలు) ఈనెల 18 నుంచి 22 వరకు జరుగుతాయని ( 5 రోజులు) ఈ అమృత కాలంలో సంతప్తికరంగా చర్చలు, సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నామని నిన్న( గురువారం) ఆయన ట్వీట్ చేశారు. వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12 వరకు జరిగాయి. ఒక దేశం – ఒకే ఎన్నికల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులు ఆమోదం పొందేలా చేయాలన్నది కూడా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఒకవేళ ఒక దేశ- ఒకే ఎన్నిక రూపొందిస్తే, 1951 పీపుల్ రిప్రజెంటెటివ్ చట్టంలో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది