పద్మినీరెడ్డి మళ్లీ వచ్చారే....!
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి.మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి గంటల వ్యవధిలోనే మళ్లీ పార్టీ మారిపోయారు. పద్మినీ రెడ్డి నిన్న మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీలో చేరిపోయి కాషాయ కండువా కప్పుకోవడం సంచలనం కల్గించింది. ఒక రకంగా కాంగ్రెస్ షాక్ తినింది. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఉన్న దామోదర రాజనర్శింహ ప్రచారాన్ని నిలిపివేసి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య అంగీకారం కుదరడంతో పద్మినీ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. రాత్రి తిరిగి ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చినట్లు పద్మినీ రెడ్డి చెప్పడం విశేషం. ఎందుకు బీజేపీలోకి వెళ్లారో? ఎందుకు తిరిగి వచ్చారో? పద్మనీరెడ్డికే తెలియాల్సి ఉంది. మొత్తం మీద పద్మినీ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి రావడంతో దామోదర నర్సింహ ఊపిరిపీల్చుకున్నారు