పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్
పుల్వామా ఉగ్రదాడి, భారత మెరుపు దాడులతో ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ చేసిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్ కు [more]
పుల్వామా ఉగ్రదాడి, భారత మెరుపు దాడులతో ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ చేసిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్ కు [more]
పుల్వామా ఉగ్రదాడి, భారత మెరుపు దాడులతో ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ చేసిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్ కు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించింది. అన్నట్లుగానే ఇవాళ పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. నిన్న మొత్తం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత బలగాలపైకి కాల్పులు జరిపిన పాక్ బలగాలు ఇవాళ భారత గగనతలంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. రాజౌరి సోక్టర్ వద్ద రెండు పాక్ యద్ధ విమానాలు భారత్ లోకి చొరబడ్డాయి. లాంబ్, కెరీ, నరియాన్ ప్రాంతాల్లో పాక్ బాంబులు వేసింది. దీంతో భారత బలగాలు వాటిని తిప్పికొట్టాయి. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ విమానాన్ని భారత్ కూల్చివేసింది. పారాచ్యూత్ సహాయంతో పాక్ పైలట్ తప్పించుకున్నాడు. అయితే, తాము భారత్ పై వైమానిక దాడులు చేశామని పాక్ ప్రకటించుకుంది. ఇదే సమయంలో పీఓకేలో రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఓ భారత పైలట్ ను అరెస్టు చేశామని పాక్ ప్రకటించుకుంది.