Sun Dec 22 2024 17:17:28 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
పాకిస్థాన్ - ఇండియా మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్ టాస్ గెలిచింది. పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది
పాకిస్థాన్ - ఇండియా మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్ టాస్ గెలిచింది. పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. భారత్ బ్యాటింగ్ లో బలంగా ఉంది. బౌలింగ్ పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఉత్కంఠ భరితంగా సాగిన గత మ్యాచ్ లో పాక్ పై ఇండియా విజయం సాధించింది. మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే గెలిచినా టెన్షన్ చివర ఓవర్ వరకూ కొనసాగింది.
బౌలింగ్ పరంగా పాక్...
ఇక పాక్ బౌలింగ్ పరంగా బలంగా ఉంది. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రమే ఫాంలో ఉండటం దానికి మైనస్ పాయింట్. గత మ్యాచ్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పాక్ కసిగా ఉంది. గత మ్యాచ్ తృటిలో చేజారిపోయింది. ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి పగ తీర్చుకోవాలన్న కసి ప్రతి పాక్ క్రికెటర్ లో కనపడుతుంది. దీంతో మరోమారు దాయాదుల పోరు ఉత్కంఠ భరితంగా కొనసాగే అవకాశముంది.
Next Story