paritala : చంద్రబాబూ మీరు మారాలి.. పరిటాల సీరియస్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో మార్పును తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రత్యర్థులు దాడులు చేస్తుంటే ఎంతకాలం సహనం వహిస్తామని ఆమె [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో మార్పును తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రత్యర్థులు దాడులు చేస్తుంటే ఎంతకాలం సహనం వహిస్తామని ఆమె [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో మార్పును తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రత్యర్థులు దాడులు చేస్తుంటే ఎంతకాలం సహనం వహిస్తామని ఆమె ప్రశ్నించారు. తన భర్తను దారుణంగా హత్య చేసినప్పుడు కూడా చంద్రబాబు సూచనతోనే ఓర్పుగా ఉన్నామని పరిటాల సునీత అన్నారు. ఇది ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే కాలం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
సహనానికి హద్దు ఉంటుంది….
ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు రావాలని కోరుకుంటున్నానని పరిటాల సునీత అన్నారు. సహనానికి కొంత హద్దు ఉంటుందని, దానిని కోల్పోయేలా చేయవద్దని ఆమె వైసీపీ నేతలను హెచ్చరించారు. తిరగబడటం నిమిషం పని అని, అంత వరకూ తెచ్చుకోవద్దని పరిటాల సునీత అన్నారు. మాలో ప్రవహించేది సీమ రక్తమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.