మరోసారి వార్తల్లోకి పార్క్ హయత్
పార్క్ హయత్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో స్వయంగా మంత్రి అల్లుడే పాలుపంచుకున్నాడు. పోలీసులు రైడ్ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో [more]
పార్క్ హయత్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో స్వయంగా మంత్రి అల్లుడే పాలుపంచుకున్నాడు. పోలీసులు రైడ్ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో [more]
పార్క్ హయత్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో స్వయంగా మంత్రి అల్లుడే పాలుపంచుకున్నాడు. పోలీసులు రైడ్ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో తెల్లవారుజామున జరిగిన పార్టీకి సంబంధించి మంత్రి అల్లుడు ఉండడంతో సంచలనం రేకెత్తిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకున్నందుకు పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో రేవ్ పార్టీ ఇచ్చిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి బర్త్ డే సందర్భంగా ఈ పార్టీ జరిగినట్లు తేలింది. ఈ పార్టీకి మంత్రి అల్లుడు తో పాటు కొంతమంది అమ్మాయిలు మరి కొంతమంది వ్యాపార వేత్తలు హాజరయ్యారు. హోటల్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది కలిసి మద్యం మత్తులో హంగామా చేస్తున్నట్టుగా తేలింది. దీంతో ప్రశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేశవరావు, భానుకిరణ్ తో పాటు నలుగురు అమ్మాయిల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో మంత్రి అల్లుడు ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.