Wed Jan 15 2025 00:45:35 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో ఆంధ్ర ప్రజలను ద్వితీయ శ్రేణీ పౌరులుగా చూశారని, కానీ చెన్నైలో తనకు ఎప్పుడూ అలాంటి భావన కలగలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాధి ఆధిపత్యంపై దక్షిణాధిన ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దక్షిణాధిన రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. ఏపీ విభజనకు కాంగ్రెస్, బీజేపీ రెండూ కారణమే అన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో అనుభవం ఉంది కదా అని చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని, 23 శాతం తమకు ఓటు బ్యాంకు ఉందని తెలిసి కూడా పోటీ చేయలేదన్నారు. కానీ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు.
Next Story