Thu Jan 16 2025 07:51:33 GMT+0000 (Coordinated Universal Time)
రెండుమూడు రోజుల్లో నిర్ణయం
తెలంగాణ ఎన్నికల్లో అవలంభించాల్సిన వైఖరిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు 2019లో వస్తే మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాలతో పాటు 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తాము భావించామని తెలిపారు.
సిద్ధంగా లేకపోవడంతో....
ఏపీ మీద ఎక్కువగా దృష్టిపెట్టినందున పెట్టినందున తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమై లేమని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీ కులాల నాయకులు తమ మద్దతు అడుగుతున్నారని, రెండుమూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని పవన్ తెలిపారు.
Next Story