Fri Dec 27 2024 02:38:48 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : హార్బర్ బాధితులకు పవన్ సాయం..
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ సాయం. ప్రతి కుటుంబానికి..
Pawan Kalyan : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటన.. అక్కడి మత్స్యకారులు కుటుంబాల్లో తీవ్ర శోఖాని తీసుకొచ్చింది. తమ జీవనాధారమైన బోట్లు తమ కళ్ళ ముందే తగలడబడిపోవడం.. వారికి రేపటి జీవనం పై భయాన్ని కలుగజేసింది. ఈ యాక్సిడెంట్ లో 60కి పైగా బొట్లు దగ్ధం అయ్యినట్లు సమాచారం. ఆ నష్టపోయిన కుటుంబాలు అన్ని ఏం చేయాలో తెలియని నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. తీవ్ర శోకంలో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను అంటూ తన గొంతు వినిపించారు.
ఆ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తాను సహాయం చేస్తానంటూ మాటిచ్చారు. అదికూడా రెండు మూడు రోజులోనే చేస్తానంటూ వెల్లడించారు. పవన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. "విశాఖ షిప్పింగ్ హార్బర్లో జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్ల దగ్ధం అయ్యినట్లు సమాచారం. ఆ ప్రమాదంలో బోట్లు పోగుట్టుకున్న ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను. ఆ కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది" అంటూ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రకటించిన సాయంతో ఆ కుటుంబాల్లో కొంత సంతోషం వచ్చినట్లు అయ్యింది. ఇక పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి కారణం యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రాత్రి ఆ యూట్యూబర్ తన భార్య శ్రీమంతం సందర్భంగా ఫ్రెండ్స్ కి బోటులో పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో బోటుకి నిప్పు అంటుకున్నట్లు, అది మిగితా బోటులకు కూడా వ్యాపించి 60కి పైగా బొట్లు దగ్ధం అయ్యినట్లు సమాచారం. ప్రమాదం సమయంలో హార్బర్ లో 400 వరకు పడవలు ఉన్నాయట.
Next Story