Wed Jan 15 2025 10:05:29 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బాటలో పవన్ కళ్యాణ్
బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా దేశమంతా తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఆయన నిన్ననే పశ్చిమబెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలిసి వచ్చారు. అంతకుముందు రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, ములాయం, శరద్ పవార్, శరద్ యాదవ్, కుమారస్వామి, స్టాలిన్ వంటి వారిని ఆయన వారివారి రాష్ట్రాలకు వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రేపు చెన్నైకి వెళ్లి ఇటీవలే పార్టీని స్థాపించిన కమల్ హాసన్ ను కలవనున్నారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. ఇంతకుముందు కూడా ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు లక్నో వెళ్లినా కలవలేదు.
Next Story