వారి వల్లే ప్రజారాజ్యం పతనం..!
ఓపిక లేని నాయకుల వల్లె ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష [more]
ఓపిక లేని నాయకుల వల్లె ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష [more]
ఓపిక లేని నాయకుల వల్లె ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమాల్లో నటన తనకు సంతృప్తి ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని చెప్పారు. ప్రజారాజ్యంలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని ఆరోపించారు. ప్రజారాజ్యం అనుభవాల వల్లె జనసేనకు కమిటీలు వేయలేదని పేర్కొన్నారు. రాష్ట్ర సమతూల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో 60 మంది కొత్త వారిని బరిలోకి దించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు కావాలంటున్నారని పేర్కొన్నారు.