Sat Jan 11 2025 04:39:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణ ఓటర్లకు పవన్ సందేశం
తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చినందునే తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయలేదన్నారు. తెలంగాణ స్వతంత్ర సమరయోధుల స్పూర్తితో యువకులు తెలంగాణను సాధించుకున్నారన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని, త్యాగాలను గుర్తించిన వ్యక్తిని అయినందునే తనకు తెలంగాణ పట్ల గౌరవం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చామన్న వాళ్లు... తెలంగాణ తెచ్చామన్న వాళ్లు... తెలంగాణను పెంచామన్న వాళ్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత పారదర్శకతతో... తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుని మంచి ప్రభుత్వం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Next Story