పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్
గౌరవం తగ్గేలా పొత్తులుండవని, ఎవరికీ లొంగిపోనని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో కలవడంపై ఆయన వివరణ ఇచ్చారు
గౌరవం తగ్గేలా పొత్తులుండవని, ఎవరికీ లొంగిపోనని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో కలవడంపై ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత కొందరు వైసీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. తాను పరామర్శ కోసమే ఆయనను కలిశానని అన్నారు. తాను బేరాలాడే వ్యక్తిని కాదని, పాతికకోట్లు ట్యాక్స్ కట్టేవాడినని అన్నారు. విశాఖలో తనకు జరిగిన ఘటనపై చంద్రబాబు తనకు మద్దతు తెలిపారని అందుకే ఆయనను కలవాల్సి వచ్చిందన్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, సన్నాసి ఐటీ మినిస్టర్ గురించి 18 నిమిషాలు, శాంతి భద్రతలపై అరగంటసేపు మాట్లాడనని తెలిపారు. రెండుసార్లు టీ తాగామని, ఏపీ భవిష్యత్ ఎలా ఉండాలి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, కానీ తాను కోరుకుంటుంది స్టెబిలిటీ ఆఫ్ స్టేట్ అని అన్నారు. గతంలో తాను టీడీపీ తిట్టినా ఇప్పుడు సర్దుకుపోక తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికలకు ఓటు చీలకూడదని, సీట్లు గురించి తాను చంద్రబాబుతో మాట్లాడలేదని, వ్యూహం ఉండాలని, ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని, ఒంటరిగా పోటీ చేస్తే మీరు తనకు మద్దతిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. కుదిరతే పొత్తు లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తానని అన్నారు.