Mon Jan 13 2025 14:40:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: రెండు రోజుల్లో టీఆర్ఎస్ కి షాక్ తప్పదు
రెండు రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ... ఇవాళ ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ బడా నేతలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉన్నా వాయిదా పడిందన్నారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబసభ్యుల వైఖరి నచ్చక పెద్దసంఖ్యలో కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎన్ సుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలుంటాయన్నారు. ఖచ్చితంగా రానున్నది ప్రజాకూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ముందుగానే ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కి, కేటీఆర్ అమెరికాకి పోవడం ఖాయమన్నారు.
Next Story