మళ్లీ వెనక్కిస్తే తప్పేంటి?
రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధుల తో మళ్ళీ [more]
రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధుల తో మళ్ళీ [more]
రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధుల తో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. బోస్టన్ కమిటీ నివేదిక వచ్చే నెల 3వ తేదీన వస్తుందని, ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇక్కడే అంతా చేస్తే తదితర ప్రాంతాల్లో ని వారికి అభివృద్ధి అక్కరలేదా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రం అంతటా సమ అభివృద్ధి జరుగుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సేవలు చంద్రబాబు కూడా గతంలో చాలా సార్లు తీసుకున్నారన్నారు.
ల్యాండ్ పూలింగ్ లాగే….
పదేళ్ళు ఉన్నా హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మోసం చేశారని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంతో వ్యాపారం చేశారని, రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరన్నారు. మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని రోడ్ల కోసం చేసేశారరన్నారు. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయలనంటే సాధ్యం కాదని పెద్దిరెడ్డి తెలిపారు. కొంత భూమిని తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పూలింగ్ అని కొత్త విధానంలో భూమి తీసుకున్నారని, మళ్ళీ అదే విధానం లో వెనక్కు కూడా ఇవ్వొచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏదైనా చేయొచ్చన్నారు. రాయల సీమ కు కావాల్సింది సచివాలయం కాదని, ముడుపుటలా తాగు, సాగు నీళ్లు అంతేనని పెద్దిరెడ్డి చెప్పారు.