Petrol : పెట్రోలు మంట పుట్టిస్తున్నారు
దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు ప్రతిరోజూ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. వాహనదారులకు పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. ఇప్పటికే ఏడాదిన్నర [more]
దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు ప్రతిరోజూ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. వాహనదారులకు పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. ఇప్పటికే ఏడాదిన్నర [more]
దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు ప్రతిరోజూ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. వాహనదారులకు పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. ఇప్పటికే ఏడాదిన్నర నుంచి దాదాపు 25 రూపాయలు పెట్రోలు ధర లీటరుకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరగడమే కాని తగ్గడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఇలా….
ఈరోజు పెట్రోలు లీటరుకు 36 పైసలు, డీజిల్ కు 38 పైసలు చొప్పున చమురు సంస్థలు పెంచాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 113.72 రూపాయలకు చేరుకుంది. డీజిల్ లీటర్ ధర 106.98 రూపాయలుగా ఉంది. ఏపీలో లీటరు పెట్రోలు 115.46 రూపాయలకు చేరుకుంది.