Mon Dec 23 2024 06:38:32 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో కుప్పకూలిన విమానం.. 133 మంది మృతి
చైనా లో విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా లో విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలి పోవడంతో పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనాకు చెందిన బోయింగ్ 737 కుప్పకూలిందని అధికారులు ధృవీకరించారు. దక్షిణ చైనా గ్వాంగ్ జియాంగ్ ప్రాంతంలో కుప్పకూలిందని చెబుతున్నారు.
133 మంది ప్రయాణికులు....
అయితే ప్రమాదం ఎందుకు జరిగింది? కారణాలేంటి? మరణాల సంఖ్య ఎంత అనేది తెలియరాలేదు. ప్రాధమిక సమాచారం ప్రకారం 133 మంది ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. విమానం కుప్ప కూలిన సమయంలో పెద్దయెత్తున పొగ కూడా వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యేటట్లు ఉన్నాయి. సహాయక కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిసింది. విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Next Story