Mon Dec 23 2024 08:51:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏలూరు ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి
అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి
ఏలూరు జిల్లా : ముసునూరు మండలంలోని అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రమాదంపై స్పందించారు. ఏపీలోని ఏలూరు కెమికల్ యూనిట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా బాధించిందని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటన అత్యంత విచారకరం. ఈ ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
Next Story