Mon Dec 23 2024 11:04:46 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ హర్షం
ట్విట్టర్ వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ తో పాటు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబోస్ రచించిన నాటునాటు పాటను ఎంఎం కీరవాణి స్వరపరచగా.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ కు ఈ అవార్డు రావడంపై.. యావత్ భారత సినీ ప్రపంచంతో పాటు అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలియా భట్, ఏఆర్ రెహమాన్, షారుఖ్ ఖాన్, క్రిష్, వెంకటేష్, రష్మిక మందన్న ఇలా సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఇంతకు మించిన గొప్ప ఆరంభం ఉండబోదని కొనియాడుతున్నారు.
Next Story