Fri Nov 22 2024 20:57:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానుల జీవిత విశేషాలతో సంగ్రహాలయం.. ప్రారంభించిన ప్రధాని
ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ మ్యూజియంను నిర్మించారు.
న్యూఢిల్లీ : దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానుల జీవిత విశేషాలతో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంగ్రహాలయాన్ని (మ్యూజియం) ప్రధాని నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్ ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ మ్యూజియంను ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ మ్యూజియంను నిర్మించారు. రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తితో ఈ సంగ్రహాలయాన్ని డిజైన్ చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని మ్యూజియంలో చూపించనున్నారు. అలాగే దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులను కూడా మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నారు.
Next Story