Sat Nov 23 2024 01:45:05 GMT+0000 (Coordinated Universal Time)
11 మెడికల్ కాలేజీలు, ఒక ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్న ప్రధాని
తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను, చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్
తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను, చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు సంబంధించిన కొత్త క్యాంపస్‌ను 12 జనవరి, 2022న సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దాదాపు రూ.4000 కోట్ల అంచనా వ్యయంతో తమిళనాడులో కొత్త వైద్య కళాశాలలు స్థాపించబడుతున్నాయి. ఇందు కోసం దాదాపు రూ.2145 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించగా మిగిలినది తమిళనాడు ప్రభుత్వం అందించింది.
Also Read : ఏపీలో నైట్ కర్ఫ్యూ ... ఉత్తర్వులు జారీ
విరుదునగర్, నామక్కల్, ది నీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో వైద్య విద్యను ప్రోత్సహించడానికి, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ వైద్య కళాశాలల స్థాపన చేస్తోంది. 1450 సీట్ల సామర్థ్యంతో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా/రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి.
Also Read : కోర్టులో కేసు నెగ్గిన నోవాక్ జొకోవిచ్
చెన్నైలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (CICT) యొక్క కొత్త క్యాంపస్ స్థాపన భారతీయ వారసత్వాన్ని రక్షించడం, సంరక్షించడం, సాంప్రదాయ భాషలను ప్రోత్సహించడమని ప్రభుత్వం చెబుతోంది. కొత్త క్యాంపస్ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందాయి. మొత్తం 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. ఇప్పటి వరకు అద్దె భవనంలో పనిచేస్తున్న CICT ఇప్పుడు కొత్తగా 3 అంతస్తుల క్యాంపస్‌లో పని చేయనుంది. కొత్త క్యాంపస్‌లో విశాలమైన లైబ్రరీ, ఇ-లైబ్రరీ, సెమినార్ హాల్స్ మరియు మల్టీమీడియా హాల్ ఉన్నాయి. CICT తమిళ భాష ప్రాచీనత, విశిష్టతను స్థాపించడానికి పరిశోధన కార్యకలాపాలు చేయడం ద్వారా శాస్త్రీయ తమిళ ప్రచారానికి సహకరిస్తోంది. ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో 45,000 ప్రాచీన తమిళ పుస్తకాల కలెక్షన్ ఉంది. సాంప్రదాయ తమిళాన్ని ప్రోత్సహించడానికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ తోడ్పడనుంది.
Next Story