Wed Apr 09 2025 14:25:29 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో 5జీ టెలికాం సేవలు.. ఎప్పట్నుంచో తెలుసా ?
ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు..

న్యూ ఢిల్లీ : భారత్ లో 5జీ టెలికాం సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్ను కోరింది. వివిధ బ్యాండ్లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది.
Also Read : ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం
మరోవైపు.. 5జీ సేవలపై ఇటీవల ట్రాయ్ పలు పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ఒక చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది. అల్ట్రా హైస్పీడ్ డేటా కోసం తీసుకురానున్న 5 జీ అంశాన్ని పరిశీలించి, త్వరగా సిఫార్సులు, అభిప్రాయాలను తెలుపాలంటూ టెలికాం శాఖ ట్రాయ్ ను కోరింది. అనుకున్నదాని ప్రకారం ఆగస్టు 15 నాటికల్లా దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే.. 4జీ డౌన్ లోడ్ స్పీట్ కంటే.. 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.
Next Story