Wed Dec 25 2024 17:20:18 GMT+0000 (Coordinated Universal Time)
Pattabhi : పట్టాభి అరెస్ట్ కు అంతా సిద్ధం
ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రిపై నిన్న పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి [more]
ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రిపై నిన్న పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి [more]
ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రిపై నిన్న పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన పట్టాభిపై వివిధ కేసులు నమోదు చేసే అవకాశముంది. ముఖ్యమంత్రిని నేరుగా దూషించిన విషయంలో ఏ కేసులు నమోదు చేయాలన్న దానిపై పోలీసులు న్యాయనిపుణలతో సంప్రదిస్తున్నారు. నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసి పట్టాభిని అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే పట్టాభి ఇంటివద్ద పోలీసులు పెద్దయెత్తున మొహరించారు.
Next Story