Fri Dec 20 2024 14:36:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను పోలీసులు రద్దు చేశారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్రను పోలీసులు రద్దు చేశారు. నిన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని అందుకే పాదయాత్రకు అనుమతిని రద్దు చేశామని పోలీసులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేపై....
వైఎస్ షర్మిల ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో జరుగుతుంది. మార్చి 5వ తేదీన పాలేరులో ఆమె పాదయాత్ర ముగియనుంది. ఇటీవల నర్సన్నపేటలో పెద్ది సుదర్శనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ఆమె బస్సును కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తగుల పెట్టారు. ఇప్పుడు మరోసారి శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలు కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని భావించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story