Wed Dec 25 2024 13:32:38 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల గుప్పిట్లో అమరావతి
రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు రాజధాని అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు ఎవరినీ రాజధాని ప్రాంతంలోకి అనుమతించడం లేదు. [more]
రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు రాజధాని అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు ఎవరినీ రాజధాని ప్రాంతంలోకి అనుమతించడం లేదు. [more]
రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు రాజధాని అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు ఎవరినీ రాజధాని ప్రాంతంలోకి అనుమతించడం లేదు. రైతులు ఆందోళనలకు కూడా రేపు అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. మందడంలోని రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రేపు నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు భారీగా మొహరించారు. ముఖ్యంగా సచివాలయానికి వెళ్లే దారిలో పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Next Story