ఏటీఎం చోరీ కేసు మిస్టరీ వీడింది
కూకట్ పల్లి కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నేరానికి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులు లేనని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి [more]
కూకట్ పల్లి కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నేరానికి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులు లేనని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి [more]
కూకట్ పల్లి కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నేరానికి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులు లేనని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు .. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కలిసి సైబరాబాద్, హైదరాబాద్ లలో పలు నేరాలకు పాల్పడి జైలు కు వెళ్లి వచ్చారని అధికారులు వెల్లడించారు. 14 రోజుల కిందట జీడిమెట్లలోని మనీట్రాన్స్ఫర్ సంస్థలో దోపిడీ కి పాల్పడ్డారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు.
పాత నేరస్థులే….
కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ మిస్టరీ వీడిపోయింది. కాల్పులకు పాల్పడింది.. ఇద్దరు పాత నేరస్తులని తేలిపోయింది. . ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఈ ఇద్దరు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారని తెలిసింది. ఆ తర్వాత ఏప్రిల్ 16న జీడిమెట్ల పరిధిలో ఓ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో తుపాకీతో బెదిరించి రూ.1.9 లక్షలు దోచుకున్నారు. ఆ సమయంలో ఆచూకీ లభించకుండా మొబైల్ ఫోన్ను మరోచోట పడేసినట్లు పోలీసులు గుర్తించారు.