Mon Dec 23 2024 23:36:21 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్సీఏ పై పోలీసులు సీరియస్
జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై పోలీసులు చర్యలకు దిగినట్లు తెలిసింది.
జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై పోలీసులు చర్యలకు దిగినట్లు తెలిసింది. అభిమానులు వస్తారని ముందుగా అంచనా వేయకుండా కేవలం ఒకే చోట టిక్కెట్లను విక్రయించడంపై కూడా పోలీసులు హెచ్సీఏను తప్పు పడుతున్నారు. ఆఫ్లైన్ లో మూడు వేల టిక్కెట్లను మాత్రమే ఉంచారు. ముప్ఫయి వేల మంది అభిమానులు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు.
ఒకే చోట విక్రయించడంతో....
గేట్లు తోసుకుని ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు ఇరవై మందిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో పూర్తిగా టిక్కెట్ కౌంటర్ ను పోలీసుల మూసివేయించారు. నగరంలో నాలుగు చోట్ల టిక్కెట్ల విక్రయిస్తే కొంత రద్దీ తగ్గేది అన్నది పోలీసు అధికారులు చెబుతున్నారు. హెచ్సీఏ నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు సీరియస్ అవుతున్నారు. పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story