Mon Dec 23 2024 11:39:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విధ్వంసం మొత్తం చేసింది వారేనట
సికింద్రాబాద్ స్టేషన్ లో నిన్న జరిగిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేయనున్నారు
సికింద్రాబాద్ లో నిన్న జరిగిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ విధ్వంసానికి సంబంధించి 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు? ఎవరు ప్రేరేపించారు? వంటి వివరాలను ఆరా తీస్తున్నారు.
నరసరావుపేట నుంచే....
వీరి మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సప్ మెసేజ్ లను కూడా పరిశీలిస్తున్నారు. ఆందోళనలో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన అభ్యర్థులు పాల్గొన్నారని తేలింది. నిన్న విధ్వంస కాండలో సాయి డిఫెన్స్ కు చెందిన 450 మంది పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంలో గుంటూరు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Next Story