Mon Dec 23 2024 17:05:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆందోళనకారులపై కాల్పులు.. ముగ్గురికి గాయాలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. పది రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. పది రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ముగ్గురు అభ్యర్థులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో తొలుత బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు, తర్వాత రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.
తగలబడుతున్న పది రైళ్లు....
పోలీసులు కాల్పులు జరుపుతున్నా పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దాదాపు పది రైళ్లకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రైల్వేస్టేషన్ లోని ట్రాక్ పైనే వారు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందనే చెప్పాలి. అయితే పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్చారా? లేదా నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిపారా? అన్నది తెలియాల్సి ఉంది. కాల్పుల్లో గాయపడిన ఆర్మీ అభ్యర్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Next Story