Mon Dec 23 2024 15:56:46 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్ స్టార్ట్
తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ కేసుపై సైబర్ [more]
తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ కేసుపై సైబర్ [more]
తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ కేసుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీఎస్ డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో విచారణ కోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. షర్మిల ఫిర్యాదుపై దుష్ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై టీ యాక్ట్ సెక్షన్ 67 – 2000, ఐసీపీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వైసీపీ సీనియర్ నాయకులతో కలిసి షర్మిల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను కలిసి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story