ఇంటి ముఖం చూడకుండా నలభై రోజులుగా…?
లాక్ డౌన్ అందరికీ కష్టాలను తెచ్చి పెడుతుంది . ప్రభుత్వ అధికారులకు మరీ ఎక్కువగా ఉంది. 24 గంటలపాటు డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారులు తీవ్రంగా ఇబ్బంది [more]
లాక్ డౌన్ అందరికీ కష్టాలను తెచ్చి పెడుతుంది . ప్రభుత్వ అధికారులకు మరీ ఎక్కువగా ఉంది. 24 గంటలపాటు డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారులు తీవ్రంగా ఇబ్బంది [more]
లాక్ డౌన్ అందరికీ కష్టాలను తెచ్చి పెడుతుంది . ప్రభుత్వ అధికారులకు మరీ ఎక్కువగా ఉంది. 24 గంటలపాటు డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు డ్యూటీ చేస్తున్నారు . విమర్శలతో పాటు అభినందనలు పోలీసు అధికారులకు వస్తున్నాయి. పలు సందర్భాల్లో పోలీసులపై దాడులు కూడా జరుగుతున్నాయి. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది . నిత్యం ఎక్కడ ఏం జరుగుతుందన్న టెన్షన్ తో పోలీస్ అధికారులు ఉన్నారు . పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ గా ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు బాధ్యత మరింతగా ఉంటుంది. ఎస్ హెచ్ ఓ లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పనులు జరగవు. అతని ఆదేశం లేకుంటే పోలీస్ స్టేషన్లో చీపురుపుల్ల కూడా పక్కకు జరగదు. పోలీస్ అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో….
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోని అధికారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి కూడా ఈ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు ఎవరూ కూడా ఇంటికి వెళ్లట్లేదు. భార్య పిల్లల్ని వదిలేసి కేవలం పోలీస్ స్టేషన్ కే పరిమితమయ్యారు. ఖానా పీనా సోనా అంతా కూడా పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది. భార్యా బిడ్డలను వదిలేసి ప్రజల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కే పరిమితమయ్యారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మురళీకృష్ణ కూడా తన కుటుంబానికి దూరమయ్యాడు . లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి పోలీస్ స్టేషన్ కి అంకితమయ్యాడు. తనతో పాటు కొంత మంది సిబ్బంది కూడా పోలీస్స్టేషన్ ను వదిలిపెట్టలేదని చెప్పారు.
మూడు నెలలకు సరిపడా…..
దీంతో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను మురళీకృష్ణ తెప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్లో వండడం వచ్చిన పోలీసు అధికారికి వంటావార్పు అప్పగించారు. పోలీస్ ఇన్స్ పెక్టర్ తో పాటు అక్కడున్న కానిస్టేబుల్ మిగతా సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇన్స్ పెక్టర్ మురళీకృష్ణ తో పాటు సిబ్బంది అంతా కూడా భార్య బిడ్డను వదిలేసి పోలీస్ స్టేషన్ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. భార్య పిల్లలతో మాట్లాడాలనుకుంటే వీడియో కాల్ చేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు . గత 40 రోజుల నుంచి కూడా తాము పిల్లల్ని వదిలేసి ప్రజల రక్షణ కోసమే స్టేషన్ కి అంకితం అయ్యామని మురళీకృష్ణ తెలిపారు . లాక్ డౌన్ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి అవసరాలు ఏర్పడతాయో తెలియకుండా ఉంటుందని, ఈ నేపథ్యంలోనే పోలీస్స్టేషన్లో 24 గంటలు అందుబాటులో ఉన్నట్లయితే ప్రజల అవసరాలు తీర్చేందుకు వస్తుందని , అందుకే ఇక్కడే ఉంటున్నామని మురళీకృష్ణ వెల్లడించారు.