Mon Dec 23 2024 15:02:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానికి ప్రముఖుల సానుభూతి
మాతృవియోగం పొందిన ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతిని తెలుపుతున్నారు. తల్లిని కోల్పోయి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ (100) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ప్రధాని.. తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకై.. స్వయంగా ఆమె పాడెను మోశారు. అనంతరం గాంధీ నగర్లో ఆమె చితికి నిప్పంటించి.. అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మరణంపై ప్రధాన భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. "నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకకు చేరుకుంది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది" అని మోదీ ట్వీట్ చేశారు.
మాతృవియోగం పొందిన ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతిని తెలుపుతున్నారు. తల్లిని కోల్పోయి విచారంతో ఉన్న ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగా ఎంతో బాధ కలిగిస్తోంది. ఈ కష్ట కాలంలో ప్రధాని మోదీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను" అని రాహుల్ ట్వీట లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సైతం ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. "శ్రీమతి హీరాబెన్ మోడీ మరణ వార్త చాలా బాధ కలిగించింది. తాను ఎంతో ప్రేమించే అమ్మను కోల్పోయిన శ్రీ నరేంద్రమోదీజీకి నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు మొత్తం వారి కుటుంబంతోనే ఉంటాయి" ఖర్గే ట్వీట్ చేశారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రధానికి సానుభూతిని తెలియజేశారు. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోదీగారికి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Next Story