Mon Dec 23 2024 09:45:40 GMT+0000 (Coordinated Universal Time)
నారావారాపల్లెలో పోలింగ్ ప్రారంభం.. అయితే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పోలింగ్ ప్రారంభమయింది. చంద్రబాబు సొంత ఊరు కావడంతో వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించింది. రెండు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పోలింగ్ ప్రారంభమయింది. చంద్రబాబు సొంత ఊరు కావడంతో వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించింది. రెండు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పోలింగ్ ప్రారంభమయింది. చంద్రబాబు సొంత ఊరు కావడంతో వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించింది. రెండు పార్టీలూ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. నిన్న రాత్రి తెలుగుదేశం నేతలు చీరలు పంపిణీ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అలాగే వైసీపీ కూడా డబ్బులు పంచుతుందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో నారావారపల్లెలో ఎవరిది విజయం అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్దయెత్తున మొహరించారు.
Next Story