రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే...!!
తనకు తొలిసారిగా ఎమ్మెల్యేగా చిరంజీవి అవకాశం ఇచ్చారని, అప్పుడు తాను గెలవాలని ఏ దేవుడ్ని గెలిపించమని కోరలేదని సినీనటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. తన జీవితంలో తొలిసారి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని భగవంతుడిని ప్రార్థించారన్నారాయన. తెలంగాణ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు దొరకడం పంచడం తొలిసారి చూశానన్నారు. ఎన్టీఆర్ నే చంపిన చంద్రబాబుకేసీఆర్ ఒక లెక్కా అనుకుని తనకు భయం వేసిందన్నారు. ఒక బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మంది అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. గద్దర్ కూడా ప్రజాకూటమిలో భాగస్వామిగా మారడంతో తాను షాక్ కు గురయ్యానన్నారు. తెలంగాణ ప్రజలకు పోసాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
బాలకృష్ణ రోషం ఏంటో...?
విశ్వాసం అనేది తెలంగాణ ప్రజల్లో ఉందని మరోసారి రుజువయిందన్నారు. అందుకే సెటిలర్లు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారన్నారు. సంక్షేమ పథకాలే కేసీఆర్ ను గెలిపించాయని ఆయన విశ్లేషించారు. నిత్యం జనాల్లో ఉండే చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షిని ఒక ఎమ్మెల్యేచెప్పుతో కొడితే కనపడలేదా? అని నిలదీశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా మహిళలకు రక్షణ కల్పించారన్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కులగజ్జిని రగిలించారన్నారు. ఏపీలో ఉండే కమ్మ సామాజికవర్గం తెలంగాణ కమ్మవారిలా నిజాయితీ గల వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఆడిన మాట తప్పని కేసీఆర్ ఖచ్చితంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేనని పోసాని డిమాండ్ చేశారు. బాలకృష్ణ మగతనం గురించి అందరికీ తెలుసునని, వాళ్ల నాన్నను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును తాట తీసింది బాలకృష్ణే నని సెటైర్ వేశారు. అంతటి రోషం బాలకృష్ణకు ఉందని ఎద్దేవా చేశారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- posani krishnamurali
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- పోసాని కృష్ణమురళి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ