ఓటు హక్కు కోల్పోయిన 40 వేల మంది ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో మరో 15 రోజుల్లో ఫలితాలు తేలనుండగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై వివాదం రాజుకుంటోంది. పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలు జరిగాయని, ఉద్యోగులు ఓటు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో 15 రోజుల్లో ఫలితాలు తేలనుండగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై వివాదం రాజుకుంటోంది. పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలు జరిగాయని, ఉద్యోగులు ఓటు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో 15 రోజుల్లో ఫలితాలు తేలనుండగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై వివాదం రాజుకుంటోంది. పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలు జరిగాయని, ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయేలా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇవాళ మరోసారి మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 108 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఇద్దరికి మాత్రమే ఇచ్చారని, ఆధారాలతో సహా తిప్పేస్వామి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య హైకోర్టును ఆశ్రయించింది. చివరి నిమిషంలో ఎన్నికల డ్యూటీ వేయడం ద్వారా 40 వేల మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయారని, వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి తాము ఓటు హక్కు సాధించుకుంటామని వారు పేర్కొంటున్నారు.