బ్రేకింగ్ : హైకోర్టులో ప్రభాస్ పిటీషన్
రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం నందిని హిల్స్ సర్వే నెంబరు 46లోని 86 ఎకరాల ప్రభుత్వ భూమి చాలా ఏళ్ల క్రితమే ఆక్రమణలకు గురైంది. అయితే, ప్రభాస్ తో చాలా మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రెవన్యూ శాఖ కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు నిన్న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ భూమిని ప్రభుత్వ భూమిగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు నిన్న పలు ఇళ్లను కూల్చివేయడంతో పాటు ప్రభాస్ ఇంటిని కూడా సీజ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నా... రెవెన్యూ అధికారుల తీరు సరిగ్గా లేదని, కనీస సమయం ఇవ్వకుండా ఇంటిని సీజ్ చేయడం సరికాదని ప్రభాస్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.