ప్రగతి నివేదన సభపై నేడు హైకోర్టు...?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను న్యాయవాది,పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ వేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాధ్యమాల ద్వారా చేయాలి కాని, ఇలా సభలు పెట్టి ప్రజలను,పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటీషన్ లో ఆయన కోరారు.పిటీషన్ ను ీఈరోజు హైకోర్టు విచారించనుంది.
పర్యావరణానికి.....
సెప్టెంబరు 2వ తేదీన అవుటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో కొంగర కలాన్ వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదన సభను జరపుతున్న సంగతి తెలిసిందే. ఈ సభకు దాదాపు 25 లక్షల మంది హాజరవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. అయితే ఇది పర్యావరణానికి భంగమని, ఈ సభను ఆపాలంటూ శ్రీధర్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.