బ్రేకింగ్ : మారుతీరావు ఆత్మహత్య
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన కూతురు అమృత ప్రణయ్ [more]
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన కూతురు అమృత ప్రణయ్ [more]
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన కూతురు అమృత ప్రణయ్ ను వివాహం చేసుకుందని ఆగ్రహించి ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. కూతురు అమృతను ఇష్టంగా భావించే మారుతీరావు తన సూసైడ్ నోట్ కూడా తల్లి దగ్గరకు వెళ్లమని అమృతకు సూచించారు. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అమృతపై ఇటీవల కాలంలో వత్తిడి తెస్తున్నారు. ఆస్తి మొత్తం అమృతకే రాసిస్తారని చెప్పారు. అయినా అమృత అంగీకరించకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.