Mon Dec 23 2024 17:37:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజకీయ పార్టీ పెడుతున్న ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో అన్ని దేశ రాజకీయ పార్టీల్లో వేడి రాజుకుంది. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో అన్ని దేశ రాజకీయ పార్టీల్లో వేడి రాజుకుంది. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకూ పలు రాజకీయ పార్టీలకు తన సేవలు అందించారు. తాజాగా అతను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ట్వీట్ చేశాడు. బీహార్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించనున్నట్లు ప్రశాంత్ ఆ ట్వీట్ లో తెలిపాడు.
"ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన & ప్రజా-పక్షపాత విధానాన్ని రూపొందించడంలో సహాయపడటం 10 ఏళ్ల రోలర్‌కోస్టర్ రైడ్‌కి దారితీసింది. నేను పేజీని తిరగేస్తున్నప్పుడు, ప్రజా సమస్యలను బాగా అర్థం చేసుకోవడానికి నిజమైన ప్రజానేతలు కావాలని తెలిసింది. ఇప్పుడు నేను ప్రజల వద్దకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. "జన సూరజ్"కి మార్గం-పీపుల్స్ గుడ్ గవర్నెన్స్" అని ప్రశాంత్ కిషోర్ ట్విట్ చేశారు.
Next Story