నేల మీద పడక.. పళ్ళు, కొబ్బరి నీళ్లే ఆహరం
రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా దేశ ప్రధాని మోడీ 11 రోజుల ఉపవాస దీక్షను చేస్తున్నారు. రాముని విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత ఆయన దీక్షను విరమించనున్నారు. ఈ 11 రోజులు ఆయన నేల మీదే నిద్రిస్తున్నారు. భోజన సమయంలో పళ్ళు తిని, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు.

ఇటీవల కేరళ రాష్ట్రంలో పర్యటించినప్పుడు కూడా ప్రధాని ఉపవాస దీక్షను కొనసాగించారు. త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ టెంపుల్ ను ఆయన సందర్శించిన సంగతి తెలిసిందే ప్రముఖ కేరళ నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహం సందర్భంగా మోధీ గురువాయూర్ ఆలయానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆ సమయంలో కూడా ఆయన యోగా మ్యాట్ పరుచుకొని నేల మీదే నిద్రించారని గెస్ట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ప్రధానికి దక్షిణాది వంటకాల రుచిని చూపిద్దామని అక్కడ సిబ్బంది ఆశ పడ్డారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి, కేవలం కొబ్బరినీళ్లు, కొన్ని పళ్లతో సరిపెట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో కూడా అయన ఉపవాసాలు చేస్తుంటారు. ఈనెల 22న మోడీ చేతుల మీదనే రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సంగతి తెలిసిందే.